పల్లవి :
వినరో భాగ్యము విష్ణు కథ
వెనుబలమిదివో విష్ణు కథ
వినరో భాగ్యము విష్ణు కథ
వెనుబలమిదివో విష్ణు కథ
చరణం 1:
ఆదినుండి సంద్యాదివిదులలో వేదంబైనది విష్ణు కథ

నాదించిందే నారదాదులచే వీధి వీధులనే విష్ణు కథ

చరణం 2:
వదలక వేదవ్యాసులు నుడిగిన విదిత పావనము విష్ణు కథ

సదనంబైనది సంకీర్తనై వెదకిన చోటనే విష్ణు కథ [2]
చరణం 3:
గొల్లెతలు చల్లలు గొనకొని చిలుకగ వెల్లివిరియాయె విష్ణు కథ

ఇల్లిదె శ్రీవేంకటేశ్వరు నామము వెల్లిగొలిపెనీ విష్ణు కథ

వినరో భాగ్యము విష్ణు కథ...[2]