
పల్లవి:
అదివో అల్లదివో శ్రీహరివాసము
పదివేల శేషుల పడగలమయము
చరణం 1:
అదే వేంకటాచల మఖిలోన్నతము
అదివో బ్రహ్మాదులకపురూపము
అదివో నిత్యనివాసమఖిలము మునులకు
అదె చూడుడు అదె మ్రొక్కుడు
అదె చూడుడు అదె మ్రొక్కుడానందమయము
చరణం 2:
చెంగటనల్లదివో శేషాచలము
నింగినున్న దేవతల నిజవాసము
ముంగిటనల్లదివో మూలనున్నధనము
బంగారు శిఖరాల బహుబ్రహ్మమయము
చరణం 3:
కైవల్యపదము వేంకటనగమదివో
శ్రీవేంకటపతికి సిరులైనవి
భావింప సకల సంపదరూపమదివో
పావనములకెల్ల పావన మయము