Wednesday, 29 March 2017

రాయినైనా కాకపోతిని

రాయినైనా కాకపోతిని రామపాదము సోకగా
బోయనైనా కాకపోతిని పుణ్యచరితము రాయగా
పడవనైనా కాకపోతిని స్వామికార్యము తీర్చగా
ఫాదుకైన కాకపోతిని భక్తిరాజ్యమునేలగా

అడవిలోపల పక్షినైతే అతివ సీతను కాచనా
ఆందువలన రామచంద్రుని అమిత కరుణను నోచనా
కడలిగట్టున ఉడతనైతే బుడతసాయము చేయనా
కాలమెల్లా రామభద్రుని వేలి గురుథులు మోయనా

కాకినైనా కాకపోతిని ఘాతుకమును సేయుచు
గడ్డిపోచను శరముచేసె ఘనత రాముడు చూపగ
మహిని అల్పజీవులే ఈ మహిమలన్ని నోచగా
మనిషినై జన్మించినానే మత్సరమ్ములు రేపగ మదమత్సరమ్ములు రేపగా


Saturday, 25 March 2017

క్షీరాబ్ధి కన్యకకు


Image result for alamelu manga

చరణం:
క్షీరాబ్ధి కన్యకకు శ్రీమహాలక్ష్మికిని
నీరజాలయమునకు  నీరాజనం

పల్లవి1:
జలజాక్షి మోమునకు జక్కువకుచంబులకు
నెలకొన్న కప్పురపు నీరాజనం
అలివేణి తురుమునకు హస్తకమలంబులకు
నిలువుమాణిక్యముల నీరాజనం

పల్లవి2:
చరణకిసలయమునకు సకియరంభోరులకు
నిరతమగు ముత్తేల నీరాజనం
అరిది జఘనంబునకు అతివనిజనాభికిని
నిరతి నానావర్ణ నీరాజనం

పల్లవి3:
పగటు శ్రీవేంకటేశు పట్టపురాణియై
నెగడు సతికళలకు నీరాజనం
జగతి నలమేల్మంగ చక్కదనములకెల్ల
నిగడు నిజశోభనపు నీరాజనం

Saturday, 18 March 2017

బ్రహ్మ కడిగిన పాదము

పల్లవి:
   బ్రహ్మ కడిగిన పాదము
   బ్రహ్మము తానేని పాదము
   బ్రహ్మ కడిగిన పాదము
  బ్రహ్మము తానేని పాదము

చరణం1:
    చలగి వసుధ కొలిచినదీ పాదము
    బలి తల మోపిన పాదము
   తలకక గగనము తన్నిన పాదము
    బలరిపు కాచిన పాదము
చరణం2:
     కామిని పాపము కడిగిన పాదము
    పాము తలనిడిన పాదము
    ప్రేమపు శ్రీసతి పిసికిన పాదము
     పామిడి తురగపు పాదము
 చరణం3:
    పరమ యోగులకు పరిపరివిధముల వరమొసెగిడి పాదము
    తిరు వేంకటగిరి తిరమని చూపిన పరమపదము నీ పాదము

    Image result for venkateswara swami paadalu