చరణం:
క్షీరాబ్ధి కన్యకకు శ్రీమహాలక్ష్మికిని
నీరజాలయమునకు నీరాజనం
పల్లవి1:
జలజాక్షి మోమునకు జక్కువకుచంబులకు
నెలకొన్న కప్పురపు నీరాజనం
అలివేణి తురుమునకు హస్తకమలంబులకు
నిలువుమాణిక్యముల నీరాజనం
పల్లవి2:
చరణకిసలయమునకు సకియరంభోరులకు
నిరతమగు ముత్తేల నీరాజనం
అరిది జఘనంబునకు అతివనిజనాభికిని
నిరతి నానావర్ణ నీరాజనం
పల్లవి3:
పగటు శ్రీవేంకటేశు పట్టపురాణియై
నెగడు సతికళలకు నీరాజనం
జగతి నలమేల్మంగ చక్కదనములకెల్ల
నిగడు నిజశోభనపు నీరాజనం
No comments:
Post a Comment