
అలరచంచలమైన ఆత్మనందుండ నీ అలవాటుసేసెనీ ఉయ్యాల
పలుమారునుచ్వాస పవనమందుండ నీ భావంబు దెలిపెనీ ఉయ్యాల
ఉదయాస్థ శైలంబు లొనరకంబంబులైన పుడుమండంబుమోచె వుయ్యాల
అదన ఆకాశపదము అడ్డౌదూలంబైన అఖిలంబు నిండె నీ వుయ్యాల
పదిలముగ వేదములు బంగారు చేరులై పట్టీ వెరపై తొచె వుయ్యాల
వదలకిటు ధర్మదేవత పీఠమైమిగుల వర్ణింప నరుదాయె వుయ్యాల
మేలుకట్లై మీకు మేఘమండలమెల్లమెరుగునకుమెరుగాయ వుయ్యాల
నీలశైలమువంటి నీ మేనికాంతికి నిజమైన తొడవాయె వుయ్యాల
No comments:
Post a Comment