పల్లవి :
పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు
పరిగి నానావిద్యల బలవంతుడు
చరణం1:
రక్కసుల పాలిటి రణరంగశూరుడు
వెక్కసపుయెకాంగ వీరుడు
దిక్కులకు సంజీవిదెచ్చిన ధీరుడు
అక్కజమైనట్టి ఆకారుడు
చరణం 2:
లలిమీరినయెట్టిలావుల భీముడు
బలుకపికుల సార్వభౌముడు
నెలకొన్న లంకానిర్దూమధాముడు
తలపున శ్రీరామనాత్మారాముడు
చరణం 3 :
దేవకార్యముల దిక్కువరేణ్యుడు
భావింప తపఃఫలపుణ్యుడు
శ్రీవేంకటేశ్వర సేవాగ్రగణ్యుడు
సావధానుడు సర్వశరణ్యుడు
No comments:
Post a Comment