Sunday, 2 July 2017

గోవిందాశ్రిత

Image result for annamacharya



గోవిందాశ్రిత గోకులబృంద
పావన జయజయ పరమానంద

జగధభిరామా సహస్రనామా
సుగుణధామ సంస్కృతనామ
గగనశ్యామా ఘనరిపుభీమా
అగణిత రఘువంశాంబుదిసోమా

గరుడతురంగా పారోత్తుంగా
సరవిభంగా ఫణిశయనాంగ
కరుణాపాంగ కమలాసంగ
వరశ్రీవేంకటగిరిపతి రంగా

No comments:

Post a Comment