
అన్ని మంత్రములు ఇందే ఆవహించెను
వెన్నతో నాకు కలిగే వెంకటేశు మంత్రము
నారదుడు జపియించే నారయణ మంత్రము
చేరి ప్రహ్లాదుడు నారసింహ మంత్రము
కోరి విభీషణుడు చేకొనె రామ మంత్రము
వెరే నాకు కలిగే వెంకటేశు మంత్రము
రంగగు వాసుదేవ మంత్రము ధ్రువుండు జపించే
అంగవించె కృష్ణ మంత్రము అర్జునుడు
ముంగిట విష్ణు మంత్రము మొగిశుకుడు పఠించే
వింగడమై నాకు నబ్బే వెంకటెశు మంత్రము
ఇన్నిమంత్రములకెల్ల ఇందిరానాధుడే గుఱి
పన్నినదిదియే పరబ్రహ్మ మంత్రము
నన్ను గావగలిగేబో నాకు గురుడియ్యగాను
వెన్నెల వంటిది శ్రీవెంకటేశు మంత్రము
No comments:
Post a Comment