
పల్లవి:
కొండలలో నెలకొన్న కోనేటిరాయడు వాడు
కొండలంత వరములు గుప్పెడువాడు
చరణం1:
కుమ్మరదాసుడైన కురువరతినంబి
ఇమ్మన్న వరమ్ములెల్ల ఇచ్చినవాడు
దొమ్ములు సెసినయెట్టి తొండమాన్ చక్రవర్తి
రమ్మన్న చోటికివచ్చి నమ్మినవాడు
చరణం2:
అచ్చపు వేడుకతోడు అనంతాళువారికి
ముచ్చెలి వెట్టికి మన్ను మోచినవాడు
మచ్చికదొలక తిరుమలనంబి తోడుత
నిచ్చనిచ్చ మాటలాడి నచ్చినవాడు
చరణం3:
కంచిలోననుండ తిరుకచినంబి మీద
కరుణించి తనయేడకు రప్పించినవాడు
యంచనెప్పుడైన వేంకటెశుడు మనలకు
మంచివాడై కరుణ పాలించినవాడు